మేమందరం 2019, మార్చిలో ఎన్నికయ్యాము. మా పదవీ కాలం 2021, మార్చితో ముగిసిపోయింది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ ఏడాది మార్చిలో ఎన్నికలు నిర్వహించలేదు. అప్పటి నుంచి మా ఒక ఎన్నికైన కార్యవర్గం లేకుండానే ఉంది. తాము ఎన్నికయిన కార్యవర్గమని చెప్పుకోవటానికి ప్రస్తుత కమిటీకి ఎటువంటి నైతిక హక్కు లేదు.. ఈ నేపథ్యంలో క్రమశిక్షణ సంఘ అధ్యక్షుడిగా.. మాలో సీనియర్ సభ్యుడిగా – మీరు పగ్గాలు చేపట్టండి.
మా ఎగ్జిక్యూటివ్ కమిటీలో ప్రస్తుతం 24 మంది సభ్యులు ఉన్నారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం గురువారం సాయంత్రం జరగనుంది. సాధారణంగా ఈ కమిటీ సమావేశానికి అధ్యక్షుడు నరేష్ అధ్యక్షత వహించాల్సి ఉంది. అయితే నరేష్ బదులుగా క్రమశిక్షణ సంఘ అధ్యక్షుడు కృష్ణంరాజు అధ్యక్షత వహించనున్నట్లు విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి.
ఈ సమావేశంలో ఎన్నికలు సహా కొన్ని ముఖ్యమైన అంశాలపై చర్చ జరిగే అవకాశముంది. ఈ నేపథ్యంలో మెజారిటీ ఈసీ సభ్యులు లేఖ రాయటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ లేఖలపై అభిప్రాయం తెలపమని మా అధ్యక్షుడిని.. క్రమశిక్షణా సంఘం సభ్యులను కృష్ణంరాజు కోరే అవకాశముంది. వారి అభిప్రాయం మేరకు ఆయన తుది నిర్ణయం తీసుకుంటారని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి