జగన్ మోహన్ రెడ్డి పార్టీకి పరోక్షంగా డ్యామేజ్ చేస్తున్న కేసీఆర్, ఎలా?

ఐవీఆర్

బుధవారం, 24 ఏప్రియల్ 2024 (12:18 IST)
కేసీఆర్. గత పదేళ్లలో ఏనాడు కూడా ఓ టీవీ ఛానల్ ఆఫీసుకి వెళ్లి మాట్లాడిన సందర్భం వుందా అంటే లేదనే చెప్పాలి. అలాంటి కేసీఆర్ ప్రత్యేకంగా ప్రముఖ టీవీ ఛానల్ టీవీ9తో అనేక విషయాలు ముచ్చటించారు. ప్రస్తుతం ఏపీలో మే 13న ఎన్నికలు జరుగునున్న నేపధ్యంలో కేసీఆర్ పలు వ్యాఖ్యలు చేసారు. తనకు అందుతున్న సమచారం ప్రకారం ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మళ్లీ రాబోతోందని జోస్యం చెప్పారు. ఐతే కూటమి గెలుస్తుందని మరికొందరు అంటున్నారు కదా అంటే... ఐనా పక్క రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, ఎన్నికలు గురించి తను ఆలోచించడం లేదన్నారు. అంతేకాదు... ఏపీలో భారాస కార్యాలయం ఏర్పాటు పైన కూడా ఇప్పుడు ఆలోచన చేయడం లేదని ఆయన వెల్లడించారు.
 
ఇదిలావుంటే... ఏపీలో జగన్ ప్రభుత్వం వచ్చే అవకాశం వున్నదని కేసీఆర్ అనడంతో కాస్తోకూస్తో పడే ఓట్లు కూడా పడే అవకాశం పోతుందని కొందరు అంటున్నారు. దీనికి కారణం... ఏపీ విభజించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూలకారణం కేసీఆర్ అనీ, అలాంటి నాయకుడు మద్దతు ఇచ్చే పార్టీకి ఓట్లు ఎలా వేస్తామంటూ అప్పుడే కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తమ్మీద ఎన్నికల వేళ కేసీఆర్ మరోసారి జగన్ మోహన్ రెడ్డి పార్టీకి పరోక్షంగా డ్యామేజ్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు