అయితే, సీఎం నిర్వహించే కార్యక్రమాలు, సమీక్షలకు హాజరయ్యే ప్రజా ప్రతినిధులకు స్నాక్స్, భోజనం పెట్టేందుకు ఓ కేటరింగ్ సంస్థకు కాంట్రాక్టు ఇచ్చారు. ఆ సంస్థకు చెందిన ఏడుగురికి తొలుత మహమ్మారి సోకింది.
దీంతో ప్రగతి భవన్‌ను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేస్తున్నారు. కాగా, వైరస్ బాధితుల్లో ఇప్పటికే కొందరు డిశ్చార్జ్ అయ్యారు. మరికొందరు చికిత్స పొందుతున్నారు. ఇంకొందరు క్వారంటైన్‌లో ఉన్నారు. ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత కరోనా బారినపడ్డారు. దీంతో రాష్ట్రంలో వైరస్ బారినపడిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య నాలుగుకు చేరింది.