ఇదిలా ఉంటే కరోనా పేషంట్లలో జలుబు, జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులు, వాసనలు పసిగట్టలేకపోవడం, రుచి చూడలేకపోవడం వంటి లక్షణాలు ఉంటాయని ఇదివరకు నిర్ధారించడం జరిగింది.
వికారం లేదా వాంతులు, డయేరియా, ముక్కు కారడం కూడా కరోనా లక్షణాలే అని తెలిపింది. కొత్తగా కనుగొన్న వాటితో కలిపి మొత్తం 11 లక్షణాలను సీడీసీ తన అధికారిక జాబితాలో చేర్చింది.
అదే సమయంలో శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది ఉన్నపుడు, ఛాతిలో నిరంతరం నొప్పి లేదా ఒత్తిడి అనిపిస్తున్నపుడు, ఒంట్లో సత్తువ లేకపోవడం, పెదవులు లేదా ముఖం నీలం రంగులోకి మారడం లాంటి లక్షణాలున్నపుడు వెంటనే స్థానికంగా ఉండే ఆరోగ్య సిబ్బంది లేదా వైద్యులను సంప్రదించాలి. లేదా 104 నంబర్ కు కాల్ చేయాలి.