విశాఖ బస్టాండులో భారీ నగదు స్వాధీనం.. నివ్వెరపోయిన నగరం

ఆదివారం, 28 జూన్ 2020 (13:10 IST)
విశాఖలోని ద్వారకా బస్‌స్టేషన్‌లో భారీగా నగదు పట్టుబడింది. దీంతో నగరం నివ్వెరపోయింది. పక్కా సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడి చేసి నగదును పట్టుకున్నారు.

బ్యాగులో 50 లక్షల 38 వేల నగదును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నగదుకు సంబందించి తగిన ఆధారాలు లేకపోవడంతో పోలీసులు నగదును స్వాధీనం చేసుకున్నారు.

పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన జయదేవ నగల దుకాణంకు సంబందించిన యజమాని ప్రవీణ్ కుమార్ జైన్ దగ్గర క్లర్క్‌గా పనిచేస్తున్న నరసింహారావు నుంచి పోలీసులు ఈ నగదును స్వాధీనం చేసుకున్నారు.

కేసు నమోదు చేసిన టూటౌన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు