కరోనా ను పూర్తి స్థాయిలో నియంత్రించాలంటే కరెన్సీని కూడా అడ్డుకట్ట వేయాల్సిందేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటివరకు కరోనా వ్యాప్తిలో భారతదేశం రెండవ ప్రమాద హెచ్చరికలో ఉంది కాబట్టి కేవలం విదేశీ ప్రయాణికులు స్వదేశీ ఆగమనం వలన కరోనా వైరస్ ఉధృతి పెరిగిపోతుంది వీరి వలన స్థానికులు కూడా కరోనా వైరస్ బాట పడుతున్నారు.
ఇలా స్థానికులకు కూడా కరోనా వ్యాప్తి చెందితే 3వ ప్రమాద హెచ్చరిక కు అంకురార్పణం చేసినట్టే.దీని వలన కరోనా సోకిన వ్యాధి గ్రస్తులు ఏమి ముట్టుకున్నా వైరస్ వ్యాపిస్తుంది. ఇటలీకి పట్టిన గతే భారతదేశానికి కుడా పడుతుంది అప్పుడు దేశం అల్లకల్లోలం అయిపోతుంది. ఇటలీ చేసిన తప్పును మన భారతదేశం చేయకుండా జనతా కర్ఫ్యూ, లాక్ డౌన్ లాంటి పద్ధతులను తీసుకువచ్చి కరోనాను కొంత వరకు అడ్డుకట్టవేశారు.