మండలంలోని ఉప్పలపాడు గ్రామానికి చెందినబోయ కవితను యాగంటిపల్లె గ్రామానికి చెందిన గోపాల్ అనే వ్యక్తి పెళ్లి చేసుకున్నాడు. ఈయనకు తాగుడు అలవాటు ఉంది. పైగా, భార్యను నిత్యం వేధించసాగాడు. దీంతో భర్త నుంచి విడిపోయి, కూలిపని చేసుకుంటూ జీవనం సాగించసాగింది.
ఇదే విషయంపై పెట్రోల్‌బంకు కూడలిలో భార్యాభర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఆవేశానికి గురైన భర్త బాలయేసు వెంట తెచ్చుకున్న బ్లేడ్‌తో భార్య గొంతు కోశాడు. దీన్ని చూసిన స్థానికులు బాలయేసును పట్టుకుని చితకబాదారు. ఆ తర్వాత రక్తపు మడుగులో ఉన్న కవితను సమీపంలోని ఆస్పత్రికి తరలించి, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.