పూర్తి వివరాల్లోకి వెళితే... తమిళనాడులోని వేలూరు జిల్లాలో 55 ఏళ్ల సెంతామరై తన 45 ఏళ్ల భార్య జయంతిని తీసుకుని గత దేవాలయానికి వెళ్లాడు. సర్లే... నువ్విక్కడే వుండు... నేను పొరుగు గ్రామంలో ఓ కార్యక్రమానికి వెళ్లి వస్తానని భర్తను గుడిలోనే వదిలేసి ఆమె అర్థరాత్రి వేళ వెళ్లింది. ఆమె తిరిగి వస్తుందని భర్త ఎంతసేపు ఎదురుచూసినప్పటికీ ఆమె రాలేదు. దీంతో అనుమానం వచ్చిన భర్త ఆమెను వెతుకుతూ గ్రామానికి వెళ్లాడు.
గ్రామ శివార్లలో తన భార్య జయంతి మరో వ్యక్తితో రాసలీలల్లో మునిగి వుండటాన్ని చూసి షాక్ తిన్నాడు. ఆగ్రహంతో వాళ్లిద్దరినీ పట్టుకుని గ్రామ పెద్దలకు అప్పగించాలని ప్రయత్నించాడు. ఈ పెనుగులాటలో అతడి లుంగీ వూడిపోయింది. అంతే... జయంతి అతడి మర్మాంగాలను కొరికేసింది. ఈ హఠత్పరిణామంతో అతడు షాక్ తిన్నాడు. కేకలు పెట్టాడు. తీవ్ర రక్తస్రావం జరిగి సొమ్మసిల్లిపడిపోయాడు. అతడి కేకలు విన్న గ్రామస్థులు పరుగున వచ్చేలోపు ప్రియుడిని తీసుకుని జయంతి పరారైంది. బాధితుడిని గ్రామస్తులు సమీప ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులిద్దరినీ అరెస్ట్ చేశారు.