నువ్వు ఇక్కడుంటే నీ భార్య ఇంకొకరితో అంటూ ప్రాణ స్నేహితులే హేళన చేయడంతో అతను మనస్థాపానికి గురయ్యాడు. ఎప్పటి లాగా భార్యతో వీడియో కాల్ మాట్లాడాడు. ఆమెతో మాట్లాడుతూ బట్టలిప్పమన్నాడు. భర్త ఎందుకు అలా అడుగుతున్నాడో కిరణ్ కుమారికి అర్థం కాలేదు. చివరిసారి నిన్ను చూడాలని చెబుతూ ఉన్నట్లుండి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసేసుకున్నాడు. భార్యకు ఏం చేయాలో అర్థం కాలేదు. స్నేహితులకు ఫోన్ చేసి చెప్పేలోపే భర్త చనిపోయాడు. దీంతో కిరణ్ కుమారి కన్నీటి పర్యంతమైంది.