తమిళనాడుకు చెందిన గోవిందస్వామి, చిత్ర దంపతులు గత ఏడేళ్ళ క్రితం తిరుపతి రూరల్‌లోని మల్లవరం పంచాయతీ గాంధీపురంకు వలస వచ్చారు. గోవిందస్వామి కూలి పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వీరికి 8 నెలల క్రితం వివాహమైంది. ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు గత 3 నెలలుగా భార్య చిత్రపై గోవిందస్వామి అనుమానం పెంచుకున్నాడు.
స్థానికంగా ఉన్న కొంతమంది యువకులతో చిత్ర మాట్లాడడం చూసిన గోవిందస్వామి ఆమెను హెచ్చరిస్తూ వచ్చాడు. అయితే చిత్రలో ఎలాంటి మార్పు రాకపోవడంతో ఆదివారం నిద్రిస్తున్న చిత్రను దారుణంగా హత్య చేశారు. గొడ్డలితో ఆమె తలి నరికి మొండెంను వేరు చేసి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. నిందితున్ని దామినేడు రహదారి వద్ద అదుపులోకి తీసుకున్నారు.