ఇందుకోసం స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నారు. గత నెలలో నిర్వహించిన స్పెషల్ డ్రంకన్ అండ్ డ్రైవ్‌లో 2815 మంది పట్టుబడ్డారు. కోర్టులో రూ.61,35,400 మంది చెలానా చెల్లించారని హైదరాబాద్ నగర్ ట్రాఫిక్ చీఫ్ అనీల్ కుమార్ వెల్లడించారు. అలాగే, గత నెల్లో 480 మందికి శిక్ష పడిందని.. వీరిలో 223 మంది జైలుకు వెళ్లినట్లు.. 62 మంది డ్రైవింగ్ లైసెన్స్‌లను న్యాయస్థానం శాశ్వతంగా రద్దు చేయడమో లేక సస్పెండ్ చేయడమో జరిగిందని వివరించారు.
జైలుకు వెళ్లిన మిగిలిన మందుబాబుల్లో ఒకరికి 10 రోజులు.. ఏడుగురికి వారం, 12 మందికి 4 రోజులు, 19 మందికి 3 రోజులు, 142 మందికి 2 రోజులు, 42 మందికి ఒక రోజు జైలు శిక్ష పడింది. వీరితో పాటు మరో 257 మందిని కోర్టు సమయం ముగిసే వరకు కోర్టులో నిల్చుని ఉండేలా శిక్ష వేశారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడిపారనే నేరంపై 10 మందికి రెండు రోజుల జైలు శిక్షలు విధించాయి. మరికొంతమందికి ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్‌లో కౌన్సెలింగ్ ఇస్తున్నట్టు అనిల్ కుమార్ వెల్లడించారు.