సందట్లో సడేమియా : వైద్య విద్యార్థినిని కాలితో తన్ని.. గిల్లిన ఖాకీ.. సస్పెండ్

గురువారం, 1 ఆగస్టు 2019 (16:16 IST)
ఈ ఆందోళనలో పాల్గొన్న ఓ విద్యార్థినిపట్ల సివిల్ డ్రెస్‌లో ఉన్న పరమేశ్ అనే పోలీస్ కానిస్టేబుల్ అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమెను గిల్లిన దృశ్యాలు పలు ఛానళ్లలోనూ ప్రసారంకావడంతో మహిళా పోలీసులు ఉన్నప్పటికీ.. ఉద్దేశపూర్వకంగానే అతడు అలా ప్రవర్తించాడని మహిళా సంఘాలు మండిపడ్డాయి. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న యువతితో హేయంగా ప్రవర్తించిన అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని వెంటనే విధుల్లోంచి తప్పించాలని డిమాండ్ చేశాయి.
 
దీనిపై హైదరాబాద్ నగర పోలీస్ కమిషనరు సీపీ అంజనీకుమార్ సస్పెండ్ చేశారు. నిజానికి విద్యార్థుల ఆందోళనను చెదరగొట్టేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ఆ సమయంలో అక్కడ మహిళా పోలీసులు విధులు నిర్వహిస్తున్నా... పరమేశ్ మాత్రం అత్యుత్సాహం ప్రదర్శించి విద్యార్థినుల పట్ల దురుసుగా ప్రవర్తించాడు. ఓ విద్యార్థినిని కాలితో తన్ని, గట్టిగా గిల్లాడు. పోలీసుల దుశ్చర్య ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు. దీంట్లో భాగంగా కానిస్టేబుల్ పరమేష్‌ను సస్పెండ్ చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు