ఐదేళ్ల సహజీవనం... పెళ్లి మాటెత్తగానే పరార్

సోమవారం, 22 జనవరి 2018 (10:51 IST)
ఐదేళ్ళ పాటు సహజీవనం చేస్తూ వచ్చిన వ్యక్తి పెళ్లి మాటెత్తగానే పారిపోయేందుకు ప్రయత్నించిన వ్యక్తిని హైదరాబాద్ నగర పోలీసులు అరెస్టు చేశారు. ఈ వివరాలను పరిశీలిస్తే, కర్నూల్ జిల్లా కొలిమిగండ్ల మండలం బి.తాడిపత్రి గ్రామానికి చెందిన పాపగారి సురేష్ (27) రహ్మత్‌నగర్‌లో నివాసం ఉంటూ అమీర్‌పేటలోని ఓ రియల్‌ఎస్టేట్ సంస్థలో పని చేస్తూ వచ్చాడు. 
 
అదేసంస్థలో పనిచేస్తున్న మహిళ (36)ను ప్రేమిస్తున్నానంటూ నమ్మించాడు. అప్పటికే పెళ్లయి భర్తతో విడిపోయిన మహిళ దీనికి అంగీకరించింది. 2012 నుంచి రహ్మత్‌నగర్‌లో గది అద్దెకు తీసుకుని వారిద్దరూ సహజీవనం చేస్తున్నారు. 2014లో వీరికి బాబు పుట్టగా పెళ్లి చేసుకున్న తర్వాతే పిల్లలను కందామని అప్పటిదాకా ఉద్యోగంలో డబ్బులు సంపాదిద్దామని సురేష్ నమ్మబలికి పుట్టిన వెంటనే బాబును రూ.40వేలకు విక్రయించేశాడు. 
 
యేడాది తర్వాత పాప పుట్టగా ఆమెను కూడా అదేవిధంగా వేరొకరికి అమ్మారు. ఇదిలావుండగా గత ఏడాది అగస్టునుంచి మహిళకు ముఖం చాటేసిన సురేష్ పెళ్లి చేసుకునేది లేదంటూ తేల్చిచెప్పాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించకుండా తప్పించుకు తిరుగుతుండడంతో మోసపోయినట్లు గుర్తించిన మహిళ తాను దళితురాలినని కాబట్టే పెళ్లికి అంగీకరించడం లేదని పేర్కొంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు సురేష్‌ను అరెస్టు చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు