అయితే అందులో పెట్టిన మూడున్నర లక్షల డబ్బు సంగతిని లేటుగా గుర్తు చేసుకున్న నాగేశ్వరరావు షాక్ అయ్యాడు. ప్యాంటులో ఉన్న డబ్బును చూశావా అంటూ ఇస్త్రీ చేసిన వ్యక్తి నాగరాజును అడిగాడు. అయితే నాగరాజు తాను డబ్బు చూడలేదని చెప్పడంతో నాగేశ్వరరావు ఆల్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు నాగరాజును అదుపులోకి తీసుకుని, తమదైన శైలిలో విచారించగా, డబ్బు తీసుకున్నట్లు అంగీకరించాడు.
ఇంటి ముందు గొయ్యి తీసి, అందులో డబ్బు పెట్టానని... రూ. 30 వేలు ఖర్చు చేశానని చేసిన తప్పును అంగీకరించాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నాగరాజు వద్ద నుంచి రూ. 3.20 లక్షల సొమ్మును స్వాధీనం చేసుకుని, నాగేశ్వరరావుకు అప్పగించారు.