నిజానికి భాగ్యనగరంలో పాలిథీన్ కవర్ల వినియోగం విచ్చలవిడిగా పెరిగిపోయింది. ఇవి పర్యావరణానికి పెను ముప్పుగా పరిణమించాయి. దీంతో ప్రజల వినియోగం నుంచి పాలిథీన్ కవర్లను తొలగించాలని భావిస్తున్నారు. ఈ మేరకు ఈనెల 23వ తేదీన జరిగిన జీహెచ్ఎంసీ పాలక మండలి సమావేశంలో పాలథీన్ కవర్ల ఆమోదం తెలిపారు. ఈ తీర్మాన ప్రతిని ప్రభుత్వ ఆమోదం కోసం పంపనున్నారు.
పౌరులు, దుకాణాదారులు, ఇతరులు ఎవరైనాగానీ పాలిథీన్ కవర్లను వినియోగిస్తే వారికి మెుదటిసారి రూ.25 వేలు, రెండోసారి పట్టుబడితే రూ.50 వేలు జరిమానా విధించాలన్నది ప్రతిపాదన. మూడోసారి కూడా ఉల్లంఘన జరిగితే ఈ ఆమోదానికి సంబంధించిన దుకాణాన్ని మూసివేయాలని భావిస్తున్నారు.