స్మార్ట్ ఫోన్, సోషల్ మీడియా కల్చర్‌తో అబ్బాయిలు, అమ్మాయిల స్నేహం కామనైపోయింది. అమ్మాయికి చాలామంది అబ్బాయిలతో స్నేహం ప్రస్తుతం సర్వసాధారణమైపోయింది. కానీ అమ్మాయిలు.. అబ్బాయిలతో స్నేహం చేయడాన్ని ఆమెను వివాహం చేసుకునే యువకులు కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారు. అమ్మాయిలు కూడా పాత బాయ్‌ఫ్రెండ్స్ వున్న సంగతిని బయటపెట్టి తలనొప్పి తెచ్చుకుంటారు.
అలాంటి వివాదమే అనంతపురం అనీషా ఆత్మహత్యలోనూ చోటుచేసుకుంది. పాత స్నేహితుడి పెళ్లికి వెళితే కొత్తగా స్నేహితుడు తప్పుగా భావిస్తాడని.. అనూష అపోహ చెందినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఎంబీఏ చదువుతున్న అనీషా రెండు రోజుల క్రితం తన స్నేహితుడు దీక్షిత్ పటేల్‌తో వీడియోకాల్‌లో మాట్లాడుతూ ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.
ఈ నెల 21న అనంతపురంలో అతని వివాహం ఉండగా, దానికి వెళ్లి వస్తానని అనీషా, దీక్షిత్ నుంచి అనుమతి కూడా తీసుకుందని, అయినప్పటికీ, అతను ఏమైనా అనుకుంటాడేమోనని తీవ్ర ఆందోళనలో పడిపోయిందని తెలిపారు. దీక్షిత్ నుంచి అనీషాపై ఎటువంటి ఒత్తిడి లేదని ప్రాథమికంగా ఓ అంచనాకు వచ్చినట్లు పోలీసు వర్గాల సమాచారం.