ఇద్దరు పిల్లల ప్రిన్సిపాల్... ఉపాధ్యాయురాలితో రెండో పెళ్లి

ఆదివారం, 15 మార్చి 2020 (13:54 IST)
ఇద్దరు పిల్లల ప్రిన్సిపాల్.. ఓ ఉపాధ్యాయురాలిపై మనసుపడ్డాడు. తొలి భార్యకు తెలియకుండా ఉపాధ్యాయురాలిని రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన యువతి బంధువులు, కుటుంబ సభ్యులు పాఠశాలపై దాడి చేసి ప్రిన్సిపాన్‌ను చితకబాదారు. హైదరాబాద్, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కార్మిక నగర్‌లో జరిగిందీ ఘటన.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హబీబ్ ఫాతిమా నగర్‌కు చెందిన అయూబ్ అలీ (42) అనే వ్యక్తి కార్మిక నగర్‌లోని ఓ పాఠశాలలో ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నాడు. అతడికి అప్పటికే వివాహమై పిల్లలు కూడా ఉన్నారు. భార్యకూడా ఉంది.
 
అదే పాఠశాలలో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయురాలి(23)తో గత కొంతకాలంగా సన్నిహితంగా ఉంటున్నాడు. ఆమె వద్ద తనకు పెళ్లైన విషయాన్ని దాచిపెట్టి, మాటలతో మభ్యపెట్టి ఎవరికీ తెలియకుండా రెండో పెళ్ళి చేసుకున్నాడు. 
 
ఈ విషయం తెలిసిన యువతి బంధువులు, కుటుంబ సభ్యులు శనివారం పాఠశాలపై శనివారం దాడికి పాల్పడ్డారు. వారి దాడిలో ఫర్నిచర్, కంప్యూటర్, పూలకుండీలు ధ్వంసమయ్యాయి. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అయూబ్ ఖాన్‌ను అరెస్టు చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు