శుక్రవారం వీకెండ్ కావడంతో నగరంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ట్రాఫిక్ పోలీసులు నిర్వహించారు. జూబ్లీహిల్స్ డైమండ్ పాయింట్ దగ్గర నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో 12 బైక్‌లు, ఐదు కార్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
అక్కడే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీ ల్లో సాయి నితీష్ అనే యవకుడు వీరంగం సృష్టించాడు. చాలా సేపు బ్రీత్ ఎనలైజర్ టెస్టుకు నిరాకరించాడు. పోలీసులు ఎంత నచ్చజెపనా వినకుండా తానో వీఐపీ కొడుకునుoటూ వీరంగం చేసాడు. పోలీసులు, మీడియాపై చిందులేశాడు. దీంతో ట్రాఫిక్ పోలీసులకు, సాయి నితీష్‌కు మధ్య వాగ్వాదం జరిగింది.