రోజానా... ఆమె ఎవరు..? ఆమె ఎవరో నాకు తెలియదు.. కంగనా రనౌత్

బుధవారం, 6 సెప్టెంబరు 2023 (18:43 IST)
ఏపీ పర్యాటక మంత్రి, సినీ నటి ఆర్కే రోజా అంటే ఎవరో తనకు తెలియదని బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ స్పష్టం చేశారు. తాను ప్రధాన పాత్రలో నటించిన చిత్రం "చంద్రముఖి-2". రాఘవ లారెన్స్ హీరో. పి.వాసు దర్శకుడు. ఈ చిత్రం ఈ నెల 15వ తేదీన విడుదలకానుంది. దీన్ని పురస్కరించుకుని ఆ చిత్ర బృందం మంగళవారం విలేకరులతో మాట్లాడింది. ఇందులో మీడియా కంగనా రనౌత్‌కు కొన్ని ప్రశ్నలు సంధించారు. 
 
రాజకీయాల్లోకి వస్తే సినిమాలను వదులుకోవాలంటూ జనసేన అధ్యక్షుడు సినీ నటుడు పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలను కంగనా వద్ద మీడియా ప్రస్తావించింది. దీనికి ఆమె సమాధానమిస్తూ.. రోజా అంటే ఎవరు అని ఆమె ఎదురు ప్రశ్న వేశారు. ఆమె ఎవరో తనకు తెలియనపుడు ఆమె గురించి తాను ఏం మాట్లాడుతానని అన్నారు. రాజకీయాల్లో తనకు అవకాశం వస్తే తాను వదులుకోనని చెప్పారు. తనకు దేశ భక్తి చాలా ఎక్కువ అని, అందుకే  పేదలకు తనకు తోచిన సాయం చేస్తున్నట్టు చెప్పారు. ఇండియా పేరును భారత్‌గా మార్చాలని తాను రెండేళ్ల క్రితమే చెప్పానని ఆమె గుర్తు చేశారు. 
 
గురువుల కన్నా గూగుల్ మిన్న :: ఏపీ విద్యామంత్రి సురేష్ 
 
కాలం మారినా.. ఎంత అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినప్పటికీ దారి గురించి చెప్పడానికి ఓ గురువు కావాల్సిందే. అంటే సమాజంలో గురువుకు ఎప్పటికీ ఓ ప్రత్యేక స్థానం ఉంది. అయితే, గూగుల్ వచ్చిన తర్వాత గురువులతో పనేముందని ఏపీ విద్యామంత్రి ఆదిమూలపు సురేష్ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అదీ కూడా టీచర్స్ డే రోజున ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మంత్రి వ్యాఖ్యలపై ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. 
 
ప్రకాశం జిల్లాలో మంగళవారం గురుపూజోత్సవ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో మంత్రి ఆదిమూలపు సురేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, గురువులు కన్నా గూగూల్ మిన్న అంటూ వ్యాఖ్యానించారు. గూగులు వచ్చాక గురువుల అవసరం పెద్దా లేకుండా పోయిందన్నారు. గురువులకు తెలియని విషయాలు కూడా గూగుల్‍లో శోధిస్తే లభిస్తున్నాయని తెలిపారు. విద్యార్థులు ప్రభుత్వం అందించిన ట్యాబుల్లో సమస్త సమాచారాన్ని బైజూస్ టెక్నాలజీ పొందుపరిచిందని వివరించారు. గురువుల స్థఆనంలో ఇపుడు గూగుల్ వచ్చిందన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు