Dirictor Sujit: రామ్ చరణ్ కు సుజిత్ చెప్పిన కథ ఓజీ నేనా..

చిత్రాసేన్

శుక్రవారం, 26 సెప్టెంబరు 2025 (10:48 IST)
Daanayya, direcotr sujit
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓజీ చిత్రం గురువారంనాడు విడుదలై మంచి ఓపెనింగ్స్ తో రికార్డ్ నెలకొల్పాయి. సినిమా స్టయిలిస్ గా వుందని అభిమానులు అంటే మరికొందరు ఏవరేజ్ గా తేల్చిచెబుతున్నారు. కాగా, అదేరోజు చిత్రం యూనిట్ ఓజీ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా యూనిట్ అంతా సంతోషంగా తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నిర్మాత డివివి దానయ్య మాట్లాడుతూ, ఓజీ సినిమాకు కారకుడైన త్రివిక్రమ్ శ్రీనివాస్ కు ధన్యవాదాలు తెలియజేశారు.
 
ఇదిలా వుండగా, విడుదలకుముందు దర్శకుడు సుజిత్ మీడియా చర్చలో మాట్లాడుతూ, సాహో సినిమా తర్వాత తను ప్లాన్ చేసుకున్న సినిమా రామ్ చరణ్ తో అనుకున్నాం. అది కూడా యూకే బ్యాక్ డ్రాప్ లో ఓ సాలిడ్ ప్రాజెక్ట్ అనుకున్నట్టు తెలిపాడు. సరిగ్గా ఆ టైంలో కరోనా కారణంగా ముందడుగు వేయలేదన్నారు. మరి అదే కథను పవన్ కళ్యాణ్ చేత చేయించాడా? అనే టాక్ కూడా ఫిలింనగర్ లో వినిపిస్తోంది.
 
ఇందుకు అంతకుముందు జరిగిన ఉదంతం కూడా గుర్తుకు తెస్తున్నారు. తమిళ దర్శకుడు శంకర్ చేసిన సినిమా గేమ్ ఛేంజర్. ఆ సినిమా ముందుగా అనుకున్న కథ వేరు. ఈ సినిమా ముందు ప్రమోషన్ లో శంకర్ మాట్లాడుతూ, కథలో పవన్ కళ్యాణ్ రాజకీయ పోరాటాన్ని ఎదుగుదలను ద్రుష్టిలో పెట్టుకుని ఆయనకు వర్తించేలా కథలో కొద్దిగా మార్పులు చేశామని చెప్పారు. ఆ సినిమా చూసినవారికి నిజమే అనిపిస్తుంది. మొదట్లో గేమ్ ఛేంజర్ కథలో అందరూ సూట్ వేసుకున్న పోస్టర్లు వెలువడ్డాయి. అది హైటెక్ లెవల్ వుంటుందని అన్నారు. కానీ సినిమా పూర్తి విరుద్ధంగా బ్లాక్ అండ్ వైట్ టీవీ రాజకీయ కథగా వుండడం పెద్ద నిరాశను కలిగించింది. సో. ఏది ఏమైనా కథలు మారడం, హీరోలు మారడం వంటివి సినిమా చరిత్రలో మామూలే అని కొందరు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు