తాను పదేపదే ప్రధానమంత్రి కార్యాలయం నుంచి చక్కర్లు కొడుతున్నానంటూ టీడీపీ నేతలు వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. చంద్రబాబును బోనులోకి ఎక్కించేంతవరకు ప్రధానమంత్రిని, మంత్రులను కలుస్తూనే ఉంటానని చెప్పారు. కేంద్రంపై అవిశ్వాసం పెట్టే నైతిక హక్కు తెదేపాకు ఏమాత్రం లేదన్నారు.
కేంద్రం నాలుగేళ్లలో ఇచ్చిన రూ.1.25 లక్షల కోట్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. చంద్రబాబుపై చర్యలు తీసుకునేంత వరకు చేయాల్సిందంతా చేస్తామని ఉద్ఘాటించారు. ప్రధాని మోడీని తన ఇష్టం వచ్చినన్నిసార్లు కలుస్తానని స్పష్టం చేశారు. చంద్రబాబు కోరిక మేరకే పోలవరం ప్రాజెక్టు బాధ్యతను రాష్ట్రానికి అప్పగించినట్లు.. రాజ్యసభలో తాను వేసిన ప్రశ్నకు కేంద్రం సమాధానం చెప్పిందన్నారు.