జాతీయ గీతాన్ని సినిమా హాళ్లలోనే ఎందుకు ప్లే చేయాలని ప్రశ్నించారు. స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా ఎంజాయ్ చేయడానికి ఉపయోగపడే సినిమా థియేటర్లు కాస్తా ఇప్పుడు దేశభక్తి నిరూపించుకునేందుకు వేదికలుగా మారాయని విమర్శించారు.
ఇంకా రాజకీయ నాయకులు తన సభలకు ముందు జాతీయ గీతాన్ని ప్లే చేయొచ్చుగా అంటూ అడిగారు. అంతటితో ఆగకుడా కార్యాలయాల్లో కూడా జనగణమన పాడేలా చూడాలన్నారు. ఇతరులకు నీతులు చెప్పేవారు ముందుగా దానిని వారే అమలు చేసి అందరికీ మార్గదర్శకంగా నిలవాలని హితవు పలికారు. కాగా 2016, డిసెంబరులో జాతీయ గీతాన్ని.. జనసేన చీఫ్ పవన్ అవమానించారంటూ... హైదరాబాదుకు చెందిన న్యాయవాది ఆయనపై కేసు పెట్టిన సంగతి తెలిసిందే.