కాగా విజయ్ శంకర్ 64 బంతుల్లో 4 ఫోర్లు కొట్టి 45 పరుగులు చేసాడు. అంతకుముందు కేవలం 18 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి టీమిండియా కష్టాల్లో కూరుకుపోయింది. ఇక ఇండియా పని అయిపోయినట్లే అనుకన్న తరుణంలో అంబటి రాయుడు-శంకర్ జోడి చక్కగా రాణిస్తూ వచ్చారు. ఐతే పరుగులు తీసే క్రమంలో అంబటి రాయుడు తొందరపాటుతనం వల్ల శంకర్ (45 పరుగులు) వికెట్ పోయింది.
ఇక మిగిలిన ఆటగాళ్ల విషయానికి వస్తే... రోహిత్ శర్మ 2, శిఖర్ ధావన్ 6, శుభమన్ గిల్ 7, మహేంద్రసింగ్ ధోని 1, అంబటి రాయుడు 90, కేదార్ 34, పాండ్యా 45, భువనేశ్వర్ కుమార్ 6, సామి 1. మొత్తం 49.5 ఓవర్లలో 252 పరుగులు చేసారు.