తెలుగు సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ శ్రీరెడ్డి పుణ్యమాని వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. ఈ వివాదం టాలీవుడ్‌ను ఓ కుదుపు కుదిపేసింది. ప్రస్తుతం కాస్టింగ్ కౌచ్‌ను తరిమికొట్టే ప్రయత్నంలో బాధితులకు అండగా ఉంటామని సినీనటి, వైసీపీ ఎమ్మెల్యే రోజా తెలిపారు.
కాకపోతే, మహిళలను లైంగికంగా ఒత్తిడి చేయడం మాత్రం తప్పు అని చెప్పింది. తనకు ఇలాంటి అనుభవం ఎదురుకాలేదని తెలిపింది. బాలీవుడ్‌తో పోల్చితే దక్షిణాదిలో సినిమా ఛాన్సులు దక్కించుకోవడం ఈజీ అని ఆదాశర్మ వెల్లడించింది.