అందుకే నేను వెళ్లలేదు.. అక్కడికి వెళ్తే పరిస్థితి వేరేలా వుంటుంది.. పవన్ కల్యాణ్ (video)

సెల్వి

మంగళవారం, 3 సెప్టెంబరు 2024 (21:46 IST)
Pawan kalyan
వరద ముంపు ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలకు ఆటంకం కలుగకూడదనే తాను వరద ప్రాతాలలో పర్యటించలేదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ క్లారిటీ ఇచ్చారు. తాను భౌతికంగా వరద ప్రాంతాల్లో పర్యటించకపోయినా.. అన్ని సహాయక కార్యక్రమాలను మానిటరింగ్ చేశానని చెప్పారు. 
 
వరద బాధితులను కనీసం పరామర్శించలేదని వస్తున్న ఆరోపణలు, విమర్శలపై ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు. ఆ ఆరోపణలకు వివరణ ఇచ్చారు. కొందరు కావాలని చేస్తున్న ప్రచారం తప్ప.. ఇందులో అర్థం లేదన్నారు.
 
వరద బాధితుల కోసం అన్నీ శాఖలు పనిచేస్తున్నాయని.. వరద బాధితులకు తాను ఎక్కడి నుంచి అయినా ధైర్యం చెప్పవచ్చు. అధికారుల సూచనల మేరకే తాను అక్కడికి వెళ్లలేదు. రెస్క్యూ ఆపరేషన్స్ జరుగుతున్నప్పుడు తాను అక్కడికి వెళితే పరిస్థితి మరోలా ఉంటుందని భావించి.. వరద ప్రాంతాలకు వెళ్లలేదని పవన్ అన్నారు. వైకాపా విమర్శలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. 

I thought of visiting flood affected areas,but officers advised me not to visit, as it will cause inconvenience for the rescue & relief operations, - Deputy CM @PawanKalyan.#VijayawadaFloods pic.twitter.com/ZwMhelNcan

— Trend PSPK (@TrendPSPK) September 3, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు