కర్నూలు- గుంటూరు జాతీయ రహదారిపై త్రిపురాంతకం మండలం మేడపి టోల్ సిబ్బంది ఓవర్ యాక్షన్ చేశారు. ఐఎఎస్. అధికారి పోలా భాస్కర్ కారు ముందు అడ్డుగా నిలబడి అడ్డుకున్నారు. జాతీయ రహదారిపై ఉన్న మేడపి టోల్ గేట్ వద్ద, టోల్ ఫీజ్ విషయంలో ఐఎఎస్. అధికారికి, టోల్ ప్లాజా సిబ్బందికి మధ్య మాటా మాటా పెరిగింది. పెద్ద గొడవే జరిగింది.
ప్రకాశం జిల్లా కలెక్టర్ గా పనిచేసి, ప్రస్తుతం కాలేజ్ ఎడ్యూకేషనల్ కమినర్ గా పోలా బాస్కర్ పనిచేస్తున్నారు. కారు ఆపి టోల్ కడితేనే వెళ్ళనిస్తామని టోల్ సిబ్బంది ఆయన్ని హెచ్చరించారు. దీనితో ఇద్దరి మద్య, మాటకు మాట గొడవగా మారింది. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు మండల రెవెన్యూ తాసిల్దార్ వి. కిరణ్ కుమార్ టోల్గేట్ ప్లాజా వద్దకు చేరుకున్నారు.
టోల్గేట్ ప్లాజా సిబ్బంది మాట్లాడే తీరు, విధానాన్ని మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. టోల్ గేట్ సిబ్బంది విధి నిర్వహణ, ప్రవర్తన సక్రమంగా ఉండాలని, ప్రభుత్వ వాహనాలను గుర్తించాల్సిన అవసరం ఉందని తెలియజెప్పారు. సిబ్బంది ప్రవర్తన బాగాలేకపోతే కేసులు నమోదు చేయాల్సిన పరిస్థితి వస్తుందని త్రిపురాంతకం మండల తాసిల్దార్ కిరణ్ కుమార్ హెచ్చరించారు. చివరికి సర్ది చెప్పి పోలాభాస్కర్ వాహనాన్ని పంపించారు.