ఎంపీ మాధవ్ పైన వచ్చిన ఆరోపణలు గురించి ప్రభుత్వం వెంటనే విచారణకు ఆదేశాలు జారీ చేసింది. మాధవ్ తనపై వచ్చిన ఆరోపణలు ఖండించారు. మార్ఫింగ్ వీడియో అని పోలీసులకు ఫిర్యాదు చేసారు. ప్రస్తుతం దర్యాప్తులో వుంది. అది మార్ఫింగ్ కాదు, నిజమైనదే అని నిరూపణ అయితే గోరంట్లపై కఠిన చర్యలు తప్పవు. ఎవరైనా మహిళలను కించపరిస్తే ప్రభుత్వం ఉపేక్షించదు అంటూ చెప్పారాయన.
కాగా వైసిపి ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్న వీడియో అంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో హల్చల్ చేస్తోంది. అందులో గోరంట్ల మాధవ్ నగ్నంగా వున్నారనీ, ఓ మహిళతో మాట్లాడుతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై వైసిపి ఎంపీ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసారు. తను జిమ్ లో వ్యాయామం చేస్తున్నప్పుడు ఎవరో వీడియో తీసారనీ, దాన్ని మార్ఫింగ్ చేసి అసభ్యకరంగా చిత్రీకరించి వైరల్ చేస్తున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియాలో ఆ వీడియోను ఎవరు అప్ లోడ్ చేసారో వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.