ఇందులోభాగంగా, నవ్యాంధ్ర ఇంటెలిజెన్స్ చీఫ్‌గా స్టీఫెన్ రవీంద్రను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఈయన గతంలో వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సీఎం సెక్యూరిటీ ఆఫీసర్‌గా పని చేశారు. అనంతపురం జిల్లాకు చెందిన స్టీఫెన్ తెలంగాణ కేడర్ ఐపీఎస్ అధికారిగా పని చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ రేంజ్ ఐజీగా విధులు నిర్వహిస్తున్నారు. ముక్కుసూటి మనిషి, నిజాయితీ కలిగిన ఐపీఎస్ అధికారిగా మంచి గుర్తింపు ఉంది.
ఈయనకు 1999లో ఐపీఎస్ సర్వీసులో చేరిన స్టీఫెన్‌కు 2004లో సురక్షా సేవ పథకం, 2005లో రాష్ట్రపతి మెడల్ వరించాయి. ఈయన్ను డిప్యూటేషన్‌పై తమకు పంపాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌కు జగన్ మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేయగా, ఆయన సమ్మతించారు. అలాగే, కేంద్ర హోం శాఖ కూడా జగన్ విన్నపాన్ని మన్ని స్టీఫెన్ రవీంద్రను డిప్యూటేషన్‌పై ఆంధ్రాకు బదిలీ చేసేందుకు సమ్మతించినట్టు సమాచారం.
అలాగే, నవ్యాంధ్ర డీజీపీగా గౌతం సవాంగ్ నియమితులు కావొచ్చని వార్తలు వస్తున్నాయి. ఈయన గతంలో విజయవాడ పోలీసు కమిషనర్‌గా విధులు నిర్వహించారు. 1986 ఐపీఎస్ బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన గౌతం సవాంగ్.. సీఆర్పీఎఫ్ జేడీగా కూడా పనిచేశారు. ఈయన కూడా తెలంగాణ కేడర్ ఐపీఎస్ అధికారిగా ఉన్నారు. ఈయన్ను కూడా జగన్ డిప్యుటేషన్‌పై కోరినట్టు సమాచారం.