పోలవరం, పీపీఏలు వంటి విషయాల్లో కేంద్రంతో ఘర్షణ వైఖరి మంచిది కాదని అభిప్రాయపడ్డారు. వైసీపీ పాలన వల్ల రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చే అవకాశం లేదని టీడీపీ పోలిట్బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి అన్నారు. అమరావతిలో జరిగిన పోలిట్బ్యూరో సమావేశం వివరాలు వెల్లడించిన ఆయన... ప్రధానంగా పార్టీ సంస్థాగత ఎన్నికలపై చర్చించినట్లు వివరించారు.
ఎగువ రాష్ట్రాల ఒక్క టీఎంసీ ఇచ్చేందుకూ ఒప్పుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్, కేసీఆర్ స్నేహం వారి వ్యక్తిగతమన్న ఆయన ఏపీ జలాలు తెలంగాణ భూముల్లోకి పంపడంపై పునరాలోచించాలని సూచించారు. పోలవరం, పీపీఏలు ఇలా అన్నింటిలో కేంద్రంతో ఘర్షణ వైఖరి నెలకొందని ఇది మంచిది కాదని అభిప్రాయపడ్డారు.