ఏపీలో పరీక్షల షెడ్యూల్ : వేసవిలో ఇంటర్ ఎగ్జామ్స్

మంగళవారం, 2 ఫిబ్రవరి 2021 (08:31 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరీక్షల షెడ్యూల్‌ను ఆ రాష్ట్ర విద్యా శాఖ విడుదల చేసింది. ఇందులోభాగంగా, వేసవిలో ఇంటర్ పరీక్షలను నిర్వహించనుంది. ముఖ్యంగా, కరోనా వైరస్ మహమ్మారి కారణంగా రాష్ట్రంలో ఇంటర్ తరగతులు ఆలస్యంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ప్రకటించారు. ​ఈ వేసవిలో మే 5 నుంచి 23వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు. మే 5 నుంచి 22వ తేదీ వరకు ఫస్టియర్ పరీక్షలు, మే 6 నుంచి 23వ తేదీ వరకు సెకండియర్ పరీక్షలు నిర్వహించనున్నారు. 
 
మార్చి 31 నుంచి ఏప్రిల్ 24 వరకు ప్రాక్టికల్స్ ఉంటాయి. కాగా, ఇంటర్ పనిదినాల కుదింపు కారణంగా ప్రాక్టికల్స్ కు సంబంధించిన సిలబస్ లో 30 శాతం తగ్గించారు. ఈ మేరకు రాష్ట్ర ఇంటర్ విద్యామండలి వెల్లడించింది. అటు, తెలంగాణలో మే 1 నుంచి 20వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు