ఏపీలో పర్యాటక వాణిజ్యం అభివృద్ధికి మార్గదర్శకాలు జారీ

శనివారం, 5 సెప్టెంబరు 2020 (21:17 IST)
ఏపీలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా పర్యాటక వాణిజ్యం (రిజిస్ట్రేషన్ మరియు సౌకర్యాలు) మార్గదర్శకాలు, 2020 ను విడుదల చేయడం జరిగిందని రాష్ట్ర పర్యాటక, క్రీడలు, యువజనాభివృద్ది శాఖా మంత్రి అవంతి శ్రీనివాస్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 
 
రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధికి ప్రణాళికలు, సులభతరమైన విధానంలో ప్రభుత్వ ఉత్తర్వుల నెం.188 తేది : 5-9-2020 ద్వారా మార్గదర్శకాలను జారీచేయడం జరిగిందన్నారు . ఇప్పటి వరకు రాష్ట్రంలో పర్యాటక వాణిజ్య ఆపరేటర్లు నమోదుచేసుకోవడానికి సరియైన యంత్రాంగం, విధివిధానాలు అందుబాటులో లేవన్నారు.

రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా సేవా రంగాన్ని బలోపేతంచేసి స్థానిక యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించే దిశలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరుగు తోందన్నారు . రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ . జగన్మోహనరెడ్డి సమక్షంలో విధివిధానాలను రూపొందించే దిశలో పవర్ పాయింట్ ప్రజెంటేషను ఇవ్వడం జరిగిందన్నారు.

ఆగష్టు 20 న జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో విధివిధానాలను రూపొందించి రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి పరిచే దిశలో అడుగులు వేస్తున్నట్లు మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు .
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటక వాణిజ్యంపై సమగ్ర నివేదికను రూపొందించి సిఫార్సు చేయడం జరిగిందని తద్వారా టూరు ఆపరేటర్లు, అనుబంధ రంగాల వారు ప్రభుత్వం అందించే రాయితీలను , ప్రోత్సాహకాలను పొందవచ్చని మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. మార్గదర్శకాలకు సంబంధించి పూర్తి వివరాలు www.aptourism.gov.in వెబ్ సైట్ లో పొందుపర్చామన్నారు.

టూరు ఆపరేటర్ల , బోట్ ఆపరేటర్లు , ట్రావెల్ ఏజెంట్లు , హెూటల్సు , రిసార్ట్సు , మైస్ సెంటర్లు , వాటర్ స్పోర్ట్సు ఆపరేటర్లు తదితర అనుబంధ రంగాల అపరేటర్లను రాష్ట్ర పర్యాటక శాఖతో అనుసంధానం చేయడం జరుగుతుందన్నారు.

ఇందుకోసం ఆయా సంస్థలు తప్పనిసరిగా రాష్ట్ర పర్యాటక శాఖతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తద్వారా రాయితీలను , ప్రోత్సాహాలను పొందాలన్నారు . కోవిడ్ కారణంగా మూతపడిన పర్యాటక రంగానికి వైభవాన్ని తీసుకొచ్చే దిశలో రాష్ట్ర ప్రభుత్వ పర్యాటక శాఖ చర్యలు తీసుకొంటోందని ఆయన తెలిపారు.

కేంద్ర మార్గదర్శకాలు సూచనలతో విధివిధానాలను రూపొందించి ఆయా రంగాలను ప్రోత్సహించడం జరుగుతోందన్నారు . గోవా , రాజస్థాన్ , హిమాచల ప్రదేశ్ , కేరళ , కర్నాటక వంటి రాష్ట్రాలలో పర్యాటక రంగంలో అభివృద్ధికి అమలు చేస్తున్న విధివిధానాలపై అధ్యయనం చేయడం తద్వారా రాష్ట్రంలో పర్యాటక వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకు సూచనలను చేశామని , సులభతరమైన మార్గదర్శకాలను జారీచేశామన్నారు.

సేవా రంగానికి పెద్దపీట వేసేందుకు నాణ్యమైన సేవలపై సూచనలు , మార్కెటింగ్ మార్గాలపై సమగ్ర నివేదిక సులభతరమైన విధానాలలో అనుమతుల మంజూరు , ఇతర రాష్ట్రాల , జాతీయ అంతర్జాతీయ పర్యాటక విభాగాలైన క్రీడలు పర్యాటక సందర్శనలు, పర్యాటక క్రీడాకారులను ప్రోత్సహించడం ద్వారా రాష్ట్రంలో పర్యాటక రంగ వాణిజ్యాన్ని ఇతోధికమైన స్థానాన్ని కల్పించడం చేయాలన్నారు.

ఇందుకు పర్యాటక సంబంధిత రంగాలవారిని , సంస్థల వివరాలను సేకరించాలన్నారు . పర్యాటక సేవా రంగంలో ఉన్నవారిని గుర్తించి రాష్ట్రంలో సమగ్ర పర్యాటక ప్రణాళికలు మరియు గణాంకాలను పొందుపరుస్తూ డేటాబేసు అనుగుణంగా మార్గదర్శకాలను జారీచేశామన్నారు .
 
సెప్టెంబర్ 4వ తేదీన పురావస్తు ప్రాంతాలు, మ్యూజియం లు, రోప్ వే, బోటింగ్, అడ్వెంచర్స్ క్రీడలు, యాత్రా స్థలాల సందర్శన, తదితరులపై మార్గదర్శకాలు జారీచేశామన్నారు. బోటింగ్ పై త్వరలోనే తేదీలను ప్రకటించి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందని మంత్రి తెలిపారు.
 
రాష్ట్రంలో పర్యాటక రంగానికి సంబంధించిన సంస్థలకు ఇది ఒక మంచి అవకాశమని దీన్ని సద్వినియోగం చేసుకోవాలని పూర్తి వివరాలకు చెల్ సైటును సందర్శించాలని టూరిజం శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రజత్ భార్గవ్ , ఎపిటిడిసి ఎండి, ఎపిటీఏ సీఈవో ప్రవీణ్ కుమార్  తెలియజేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు