స్దానికంగా నెలకొన్న తాజా పరిస్ధితులను గవర్నర్ తెలుసుకున్నారు. గత మూడు రోజులుగా సుమారు 467 మంది వింత వ్యాధి బారిన పడి ఆసుపత్రిలో చేరారని, ప్రభుత్వ పరంగా మెరుగైన వైద్యం అందించటం వల్ల 263 మంది కోలుకుని తమ నివాసాలకు చేరుకున్నారన్నారని సిఎం వివరించారు.
వ్యాధి మూలాలను తెలుసుకునేందుకు జాతీయ స్దాయి వైద్య ఆరోగ్య పరిశోధనా సంస్ధల సహకారం తీసుకుంటున్నామని, ఎయిమ్స్, ఐఐసిటి, సిసిఎంబి, ఎన్ఐఎన్ వంటి సంస్ధలు బాధితుల రక్త నమూనాలతో పాటు అవసరమైన ఇతర అన్ని నమూనాలను పరిక్షిస్తున్నాయని ముఖ్యమంత్రి తెలిపారు.
వింత వ్యాధి బాధితుల సమస్యను పరిష్కరించే క్రమంలో, ప్రభుత్వపరంగా మరింత అప్రమత్తత అవసరమని, వేగవంతమైన పనితీరు కనబరిచేలా స్ధానిక, వైద్య ఆరోగ్య శాఖ యంత్రాంగాన్ని ప్రోత్సహించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి గవర్నర్ సూచించారు.