సీఎం జగన్ చేసి అతిపెద్ద తప్పు అదే.. లేకుంటేనా... ఉండవల్లి అరుణ్ కుమార్

సోమవారం, 21 డిశెంబరు 2020 (11:29 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్. జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయాల్లో అతిపెద్ద తప్పుడు నిర్ణయం రాజధాని అమరావతిని మార్చాలన్నదేనని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పుకొచ్చారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, నవ్యాంధ్ర రాజధానిగా అమరావతిని ఎంపిక చేసిన తర్వాత దాన్ని మరో ప్రాంతానికి మార్చాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకోవడం వెనుక అనేక కారణాలు ఉండివుండొచ్చన్నారు. అది చాలా పెద్ద తప్పుడు నిర్ణయమని చెప్పుకొచ్చారు. 
 
అంతేకాకుండా, నారా చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న సమయంలో గ్రాఫిక్స్‌తో మభ్యపెట్టారని ఆరోపించారు. కానీ, అమరావతిలో అనేక భవనాల నిర్మాణం కోసం కోట్లాది రూపాయలను ఖర్చు చేశారని ఉండవల్లి గుర్తుచేశారు. 
 
చంద్రబాబు నాయుడు అనుకున్నట్టుగా రాజధాని అమరావతి నిర్మాణం పూర్తికావాలంటే 400 లేదా 500 సంవత్సరాలు పడుతుందన్నారు. అదేసమయంలో రాజధాని అమరావతిపై ఏపీ శాసనసభలో చర్చ చేపట్టాలని ఉండవల్లి అరుణ్ కుమార్ కోరారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు