1985 నవంబరు 22న న్యాయవాదిగా ఎన్రోల్ అయిన ఆయన... సివిల్, క్రిమినల్, రాజ్యాంగపరమైన కేసులను వాదించారు. మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా 2005 నవంబరు 25న నియమితులయ్యారు.
తాజాగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, సీనియర్ న్యాయమూర్తులు జస్టిస్ ఎస్ఏ బోబ్డే, జస్టిస్ ఎన్.వి.రమణతో కూడిన కొలీజియం సిఫార్సు మేరకు ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ జె.కె.మహేశ్వరి నియమితులయ్యారు.