ప్రపంచ ఆర్థిక సదస్సులో లోకేశ్

శుక్రవారం, 4 అక్టోబరు 2019 (06:51 IST)
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ దిల్లీలో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో​ పాల్గొన్నారు. ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు డేటా వినియోగం, పారిశుద్ధ్య నిర్వహణపై ఈ సమావేశంలో లోకేశ్​ చర్చించారు.

ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆర్థిక బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై పలువురు వక్తలు తమ అభిప్రాయలను తెలియజేశారు. దేశ రాజధాని దిల్లీలో ప్రపంచ ఆర్థిక సదస్సు ఆధ్వర్యంలో నిర్వహించిన ఇండియా ఎకనామిక్ సదస్సులో యంగ్ గ్లోబల్ లీడర్ హోదాలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ పాల్గొన్నారు.

అప్పట్లో పంచాయతీ రాజ్, ఐటీ మంత్రిగా ఉన్న సమయంలో ఆధునికత సాంకేతికతో సాధించిన వృద్ధి, గ్రామాల అభివృద్ధి, తాగునీటి సరఫరా కార్యక్రమాలను చూసి ఎకానమిక్​ ఫోరం ఆయనను యంగ్​ గ్లోబల్​ లీడర్​గా గుర్తించింది.

ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆర్థిక బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు. ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు డేటా వినియోగం, పారిశుద్ధ్య నిర్వహణపై జరిగిన చర్చలో నారా లోకేశ్​ పాల్గొన్నారు.

దేశంలోని నగరాల్లో మెరుగైన పారిశుద్ధ్యం కోసం తీసుకోవాల్సిన చర్యలు, ప్రపంచ వ్యాప్తంగా తక్కువ ఖర్చుతో పారిశుద్ధ్య నిర్వహణకి అనుసరిస్తున్న విధానాలపై ఇందులో చర్చించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు