ఏపీలో ఇసుక కొరతకు నిరసనగా 36 గంటల దీక్షకు సిద్ధమైన కొల్లు రవీంద్రను పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదంటూ రవీంద్ర సహా అందరినీ బలవంతంగా తరలించారు. అటు కృష్ణా జిల్లాలో పలువురు టీడీపీ నేతల్ని హౌస్ అరెస్ట్ చేశారు. తాము ప్రజాసమస్యలపై శాంతియుతంగా నిరసన తెలుపుతున్నా ప్రభుత్వం అడ్డుకోవడం ఏంటని కొల్లు రవీంద్ర మండిపడ్డారు.
ఏపీ సర్కార్ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జగన్ వైఖరితోనే రాష్ట్రంలో ఇసుక కొరత ఏర్పడిందన్నారు టీడీపీ నేత, మాజీ మంత్రి చినరాజప్ప. విశాఖలో లారీ ఇసుక ధర లక్ష రూపాయలు పలుకుతుందని అన్నారు. ఇసుక కోసం కొల్లు రవీంద్ర నిరసన చేస్తే అరెస్ట్ చేయడం దారుణం అన్న చినరాజప్ప… టీడీపీ ప్రభుత్వ హయాంలో జగన్ ధర్నాలు చేసినప్పుడు ఇలానే చేసామా అని ప్రశ్నించారు.