జగన్ పాదయాత్ర... పవన్ రథయాత్ర... మరి బాబు ఏం యాత్ర?

శనివారం, 15 జులై 2017 (15:59 IST)
ఎన్నికల వేడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెల్లమెల్లగా రాజుకుంటోంది. ఇప్పటికే వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో ప్రజల వద్దకు తరచూ వెళ్లి సభలు, సమావేశాలు పెడుతూ ముందుకు వెళుతున్నారు. ఇక జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా మంచి ఊపు మీద వున్నట్లు తెలుస్తోంది. 
 
తను ప్రారంభించిన రెండుమూడు సినిమాల షూటింగులు పూర్తి కాగానే రాజకీయాలకు పూర్తి సమయాన్ని కేటాయించాలని అనుకుంటున్నారట. ఇందులో భాగంగా ఆయన రథయాత్ర చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబరు 2 పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జనసేన పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ఓ కీలక నిర్ణయాన్ని తీసుకోనున్నారట. అదేమిటంటే... ప్రజలను నేరుగా కలిసేందుకు రథయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారట. 
 
ఈ రథయాత్ర ఆయన పోటీ చేస్తానంటున్న అనంతపురం జిల్లా నుంచి ప్రారంభించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటించి ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలోను పర్యటించాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇదిలావుంటే అక్టోబరు 27 నుంచి జగన్ మోహన్ రెడ్డి తన పాదయాత్రను మొదలుపెట్టనున్నాడు. ఐతే జగన్ పాదయాత్ర, పవన్ కళ్యాణ్ రథయాత్రతో పాటు ఏపీ సీఎం చంద్రబాబు ఏ యాత్ర చేస్తారో..

వెబ్దునియా పై చదవండి