జగన్-షర్మిల ఆస్తుల గొడవ, ఆ సరస్వతి పవర్ భూముల సంగతేంటి? నివేదిక ఇవ్వండి: పవన్ కల్యాణ్

ఐవీఆర్

శుక్రవారం, 25 అక్టోబరు 2024 (22:45 IST)
మాజీ ముఖ్యమంత్ర వైఎస్ జగన్ మోహన్ రెడ్డి-వైఎస్ షర్మిల ఆస్తుల వ్యవహారంలో దేశంలోని ఇతర రాష్ట్రాలతో పాటు మన రాష్ట్రంలో వున్న పలు ఆస్తుల వ్యవహారం కూడా వెలుగులోకి వచ్చాయి. వీటిలో పలనాడు జిల్లాలో వున్న సరస్వతి పవర్ భూములు. ఈ కంపెనీకి చెందిన 1515.93 ఎకరాల్లో ప్రకృతి సంపద, కొండ భూములు, వాగులు, వంకలు మెండుగా వున్నాయని ప్రచారం జరుగుతోంది.
 
మీడియాలో జరుగుతున్న ప్రచారం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెంతకు చేరింది. దీనితో సరస్వతి పవర్ భూములకు సంబంధించి పర్యావరణ అనుమతులు వున్నాయా? అసలు ఆ సంస్థకు చెందిన భూముల్లో ప్రకృతి సంపద వుంటే.. వాటికి పర్యావరణ అనుమతులు ఎలా వచ్చాయనేది తనకు తెలియజేయాలని పీసీబీని డిప్యూటీ సీఎం ఆదేశించారు. ఈ అంశంపైన అటవీ, రెవిన్యూ, పిసీబీ ఉన్నతాధికారులతో పవన్ కల్యాణ్ సమీక్షించనున్నట్లు తెలుస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు