పంచాయతీ ఎన్నికలపై సుప్రీం తీర్పుతో అహం దెబ్బతిన్న ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని రద్దు చేసే యోచన చేశాడని, ఇంటిలిజెన్స్ నివేదికల ద్వారా ప్రజావ్యతిరేకత తెలుసుకొని తోక ముడిచాడని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
మంత్రులు, ఎమ్మెల్యేలు నాలుగు గంటల పాటు మల్లగుల్లాలు పడి నిర్ణయాన్ని ఉప సంహరించుకోవాలని కోరినట్టు తెలిపారు. ఆ సమయంలోనే ఇంటిలిజెన్స్ నివేదికను తెప్పించుకున్న జగన్ తన పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను తెలుసుకొని ప్రభుత్వాన్ని రద్దు చేసే నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నట్టు చెప్పారు.
రాజ్యాంగ బద్ద పదవులలో ఉన్న స్పీకర్‌తో పాటు ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ సలహాదారులు ఎన్నికల కమిషన్‌పై చేస్తున్న వ్యాఖ్యలను సుమోటోగా తీసుకొని వారిపై రాజ్యాంగ పరంగా చర్యలు తీసుకోవాలన్నారు.