ఇడుపులపాయలో హైవే వేస్తాం : వైకాపాకు పవన్ కళ్యాణ్ హెచ్చరిక

శనివారం, 5 నవంబరు 2022 (11:07 IST)
జనసేన పార్టీ ఆవిర్భావ సభకు స్థలం ఇచ్చారన్న అక్కసుతో ఇప్పటం గ్రామంలో రోడ్ల విస్తీర్ణంతో పేరుతో ఇళ్లను ఈ అరాచక ప్రభుత్వం కూల్చివేతకు శ్రీకారం చుట్టిందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన వైకాపా నేతలకు గట్టి హెచ్చరిక చేశారు. తాము అధికారంలోకి వస్తే ఇడుపుపాయలో హైవే వేస్తామంటూ హెచ్చరించారు. 
 
శనివారం ఇప్పటం గ్రామంలో పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. రోడ్డు విస్తరణ పేరుతో ఇల్లు కూల్చివేయడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విస్తరణ చర్యల్లోభాగంగా, జాతీయ నేతల విగ్రహాలను కూల్చివేసిన అధికారులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం జోలికి మాత్రం వెళ్లలేదన్నారు. ఆ విగ్రహం ఉన్న చోట రోడ్డు విస్తరణ అక్కర్లేదని వితండవాదం చేస్తున్నారని మండిపడ్డారు. 
 
పైగా, ఈ వైకాపా గూండాలకు ఒక్కటే చెబుతున్నాం.. తాము అధికారంలోకి వస్తే ఇడుపులపాయలో హైవే వేస్తామంటూ హెచ్చరించారు. అదేసమయంలో పోలీసులు ఎంత రెచ్చగొట్టినా ప్రశాంతంగా ఉండాలని ఆయన జనసైనికులను కోరారు. పోలీసులు మన సోదరులే.. వారికి కూడా సమస్యలు ఉన్నాయని చెప్పారు. కాకినాడి, అమరావతి, రాజమండ్రి వంటి ప్రాంతాల్లో రోడ్లు విస్తరణ అక్కర్లేదు. ఇప్పటం వంటి పల్లెటూరుల 120 అడుగుల వెడల్పుతో రోడ్డు కావాలా? పైగా, రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చలేని ఈ ప్రభుత్వం రోడ్డు విస్తరణ పనులు చేస్తుందా? అంటూ ఆయన నిలదీశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు