ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకునే విషయంలో వైకాపా ఏమాత్రం చిత్తశుద్ధివున్నా.. ఆ పార్టీకి చెందిన 22 మంది ఎంపీలకు స్టీల్ ప్లాంట్ కోసం ఢిల్లీలో ఏం చేశారో చెప్పాలని నిలదీశారు.
అలాగే కేంద్ర ప్రభుత్వం ఒక్క వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌ని దృష్టిలో పెట్టుకుని పెట్టుబడుల ఉపసంహరణ ప్రతిపాదన తీసుకురాలేదని వివరించారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వసంస్థలు, పరిశ్రమలు నడపడంలో వస్తున్న ఒడిదొడుకుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలియజేశారు.
అయినా విశాఖ ఉక్కు పరిశ్రమ ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీకగా భావిస్తున్నానన్నారు. ఆ కారణంగానే దిల్లీ వెళ్లి కేంద్రమంత్రి అమిత్‌షాను కలిసి స్టీల్‌ప్లాంట్ ఆంధ్రులకు ఎంత ప్రాధాన్యమైనదో వివరించానన్నారు. నాడు భూములు ఇచ్చిన రైతుల కుటుంబాలు ఇప్పటికీ పరిహారం కోసం పోరాటం చేస్తున్నాయని గుర్తు చేసినట్టు పేర్కొన్నారు.