రామోజీ రావు.. లక్షలాది మందికి ఆదర్శం... విచారణ పేరుతో వేధించడం విచారకరం

బుధవారం, 5 ఏప్రియల్ 2023 (10:37 IST)
తెలుగు సినీ, మీడియా రంగంలో విప్లవాత్మకమైన అభివృద్ధిని తీసుకొచ్చి, వ్యాపార రంగంలో వేలాది మందికి జీవనాధారం కల్పిస్తూ, కళారంగంలో "గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్"లో చోటు దక్కించుకొని ప్రపంచస్థాయిలో తెలుగు ఖ్యాతిని చాటి చెప్పిన "పద్మ విభూషణ్" రామోజీ రావుని విచారణ పేరుతో వేధించడం విచారకరమని జనసేన నేత, నటుడు నాగబాబు అన్నారు. 
 
మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీలో ఆర్థిక అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ఆయన వద్ద ఏపీ సీఐడీ పోలీసులు విచారిస్తున్నారు. దీనిపై నాగబాబు వరుస ట్వీట్లు చేశారు. 'లక్షలాది మందికి ఆదర్శం. ఆరు దశాబ్దాల ప్రస్థానంలో ఆయనకు ఎదురు కాని అవినీతి ఆరోపణలు వైకాపా ప్రబుత్వం అధికారంలోకి వచ్చాక పుట్టుకు రావడం విచారకరం. ఏడు పదుల వయసుపైబడిన రామోజీ రావుని, ఆయన కుటుంబాన్ని విచారణ పేరుతో వేధించడం శోచనీయం. అలాగే, రామోజీ రావుపై సామాజిక మాధ్యమాల్లో కావాలని చేస్తున్న ప్రచారాన్ని ఖండిస్తున్నాం అని నాగబాబు చేసిన ట్వీట్లలో పేర్కొన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు