అయితే, గత 2019 ఎన్నికల్లో ఆ పార్టీ 9 శాతం ఓట్లు సాధించినప్పటికీ సీట్లు సాధించడంలో విఫలమైంది. ఫలితంగా ఆ పార్టీ తన ఎన్నికల గుర్తును కోల్పోవాల్సి వచ్చినట్టు ఈసీ స్పష్టం చేసింది. పైగా, గతంలో బద్వేల్, తిరుపతి లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తును ఇతరులకు కేటాయించింది.
ఇపుడు తెలంగాణ రాష్ట్రంలో గాజు గ్లాసును ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. అయితే, న్యాయ నిపుణులతో చర్చించి, న్యాయపోరాటం చేసే అంశాన్ని పరిశీలిస్తామని ఆ పార్టీ సీనియర్ నేతలు చెప్పారు.