ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలు చేసే జె.సి.దివాకర్ రెడ్డి మరోసారి అదే పనిచేశారు. ఏర్పేడు ఘటనలో ఇసుక మాఫియా ప్రమేయంపై మీడియా ఆయన్ను ప్రశ్నించగా వెరైటీ సమాధానమిచ్చారు. ఇసుక అక్రమ రవాణాలో తాను లేనని, తెలుగుదేశంపార్టీ వారు మాత్రమే ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారా అని మీడియానే తిరిగి ప్రశ్నించారు.