మాజీ సీఎం జగన్‌కు మతిభ్రమించింది.. ఆట ఇపుడే మొదలైంది... : బొలిశెట్టి సత్యనారాయణ

వరుణ్

శుక్రవారం, 5 జులై 2024 (17:00 IST)
మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మత్రిభ్రమించి, సిగ్గూ లజ్జా లేకుండా మాట్లాడుతున్నారంటూ జనసేన పార్టీ నేత బొలిశెట్టి సత్యనారాయణ ఆరోపించారు. ఆయన శుక్రవారం తన ట్విట్టర్ ఖాతాలో ఓ సుధీర్ఘ పోస్టు చేశారు. ఇందులో మాజీ సీఎం జగన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన చేసిన ట్వీట్‌లోని అంశాలను పరిశీలిస్తే, 
 
"మాజీ సీఎం జగన్ మతి భ్రమించిందో లేదా సిగ్గూ లజ్జా పూర్తిగా వదిలేశారో అర్థం కావడం లేదు. సాక్ష్యం రెండు పోలవరం ప్రాజెక్టులను పూర్తి చేసిన మాజీ జలవనరులు శాఖ మంత్రులు అంబటి రాంబాబు, అనిల్ కుమార్ యాదవ్, వెనుక మొన్నటి వరకూ నెల్లూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడుగా ఉండి పార్టీని నిర్వీర్యంచేసి నాశనం చేసి తిరిగి వైసీపీ గూటికి చేరిన గుంట నక్క మోసగాడు మనుక్రాంత్ రెడ్డి. వీరందరినీ వెంటపెట్టుకొని ఒక నేరస్తుడిని వెనకేసుకొస్తున్న జగన్ రెడ్డిని చూస్తుంటే జాలి వేస్తుంది. 
 
2022 తన సహచర మంత్రిని పర్యాటక శాఖ మంత్రి రోజాపై హత్యాయత్నం జరిగిందని సీన్ ఆఫ్ ఆఫన్స్‌లో లేని మాపై 307 సెక్షన్ పెట్టినప్పుడు అది తప్పు అనిపించని జగన్ రెడ్డికి ఇప్పుడు ఆధారాలతో పిన్నిల్లి రామచంద్రా రెడ్డి దొరికిపోతే కోర్టు ఆదేశాల మేరకు అరెస్టు చేస్తే తప్పనడానికి నోరెలా వచ్చిందో అర్థం కావటం లేదు. ఆట ఇప్పుడే మొదలయ్యింది.. ముందుంది మొసళ్ల పండగ.. కోర్టులకు హాజరవ్వాలి.. విధించిన శిక్ష అనుభవించాలి.. జగన్ రెడ్డి ఈ పాట ఒక సారి వినండి ఇది అందరికీ వర్తిస్తుంది. 
 
సత్కర్మభీశ్చ సత్ఫలితం..
దుష్కర్మ ఏవ దుష్ఫలం
అత్యుత్కట పుణ్య పాపానాం సత్యంబలానుభవమిహం
ఈ చోటి కర్మ ఈ చోటే
ఈ నాటి కర్మ మరునాడే అనుభవించి తీరాలంతే
ఈ సృష్టి నియమం ఇదే
"ఎన్ని కన్నీళ్ళ ఉసురిది" వెంటాడుతున్నది నీడల్లే కర్మ
ధర్మమే నీ పాలిదండమై దండించ తప్పించుకోలేదు జన్మ
భారతదేశంలో ధర్మం తన పని తాను చేసుకుపోతుంది.. అంటూ ట్వీట్ చేశారు. 


 

మాజీ ముఖ్యమంత్రి @ysjagan గారికి మతి భ్రమించిందో లేదా సిగ్గూ లజ్జా పూర్తిగా వదిలేశారో అర్థం కావడం లేదు..

సాక్ష్యం రెండు పోలవరం ప్రాజెక్టులను పూర్తి చేసిన మాజీ జలవనరులు శాఖ మంత్రులు అంబటి రాంబాబు, అనిల్ కుమార్ యాదవ్, వెనుక మొన్నటి వరకూ నెల్లూరు జిల్లా @JanaSenaParty అధ్యక్షుడుగా… pic.twitter.com/Z33ZgQWoQS

— Bolisetty Satyanarayana (@bolisetti_satya) July 5, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు