కాగా, కె.రోశయ్య అంత్యక్రియలు సోమవారం హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన కొంపల్లిలో ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు. ముందుగా ఆయన పార్థివదేహాన్ని సోమవారం ఉదయం 11 గంటలకు గాంధీ భవన్‌కు తరలించి అక్కడ కొద్దిసేపు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సందర్శనార్థం ఉంచుతారు.
ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటల నుంచి రోశయ్య అంతిమయాత్ర మొదలై 1.30 గంటల ప్రాంతంలో ఆయన అంత్యక్రియలను పూర్తిచేస్తారు. ఏపీ ప్రభుత్వం తరపున మంత్రులు బొత్స సత్యనారాయణ, బాలినేని శ్రీనివాస రెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్‌లు ఈ అంత్యక్రియలకు హాజరుకానున్నారు.