ముఖ్యంగా, పర్యావరణ అనుమతులు తీసుకోకుండా పోలవరం, పరిధిలోని పురుషోత్తమ పట్నం, చింతలపూడి, పట్టిసీమ ఎత్తిపోతల పనులు కొనసాగిస్తున్నందుకుగాను ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసి, భారీ అపరాధం విధించారు.
ఏపీకి విధించిన రూ.120 కోట్ల అపరాధంలో పురుషోత్తంపట్నకు రూ.24.56 కోట్లు, పట్టిసీమకు రూ.24.90 కోట్లు, చింతలపూడికి రూ.73.6 కోట్లు చొప్పున జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది.
పైగా, ఈ అపరాధాన్ని మూడు నెలల్లోగా కాలుష్య నియంత్రణ మండలికి చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే, ఈ అపరాధం నిధుల వినియోగంపై కూడా ఏపీపీసీబీ, సీపీసీబీ సభ్యులతో ఒక కమిటీని నియవించాలని సూచన చేసింది.