వివరాల్లోకి వెళితే.. పోరుమామిళ్ల మండలం, చిన్నాయిపల్లె గ్రామానికి చెందిన సావిత్రికి, బద్వేలు ప్రాంతానికి చెందిన నాగేంద్రతో 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. ప్రస్తుతం సావిత్రి 8 నెలల గర్భిణి.
అయితే నాగేంద్ర బద్వేలులో ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని భార్యను అడ్డు తొలగించుకుంటే, ప్రియురాలిని సొంతం చేసుకోవాలనే దురుద్దేశంతో.. పుట్టింటిలో ఉన్న సావిత్రిని శుక్రవారం మోటారుబైకుపై ఎక్కించుకొని మార్గమధ్యలో వాహనంపై నుంచి తోసేసేందుకు ప్రయత్నం చేశాడు. అయితే గర్భిణీ మహిళ స్వల్ప గాయాలతో బయటపడింది. శుక్రవారం రాత్రి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సావిత్రి ఫిర్యాదు చేసింది.