కాకినాడ కేంద్రీయ విద్యాలయంలో కళ్లు తిరిగి పడిపోయిన విద్యార్థులు

బుధవారం, 7 సెప్టెంబరు 2022 (14:25 IST)
Kendriya Vidyalaya
కాకినాడ కేంద్రీయ విద్యాలయంలో విద్యార్థులు ఉన్నట్టుండి కళ్లు తిరిగి పడిపోయారు.  వివరాల్లోకి వెళితే.. కాకినాడ వలసపాకలలోని కేంద్రీయ విద్యాలయంలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఉదయం స్కూల్‌లో పాఠాలు జరుగుతుండగానే 18 మంది పిల్లలు ఊపిరాడక కళ్లుతిరిగి పడిపోయారు. 
 
5,6,7 తరగతుల్లోని కొందరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందించారు. పిల్లలను సమీపంలోని హాస్పిటల్‌లో చేర్చారు. తర్వాత జీజీహెచ్‌కి తరలించి వైద్యం అందించారు. 
 
విష వాయువు పీల్చగానే కళ్లు తిరిగాయన్నారు విద్యార్థులు. విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. జరగరానిది జరిగితే బాధ్యులెవరని ప్రశ్నించారు. చికిత్స తర్వాత అస్వస్థతకు గురైన 18 మంది కోలుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు