తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ ద్వితీయ సంవత్సర అడ్వాన్స్‌డ్ సిప్లమెంటరీ ఫలితాలను మంగళవారం విడుదల చేశారు.ఈ ఫలితాలను ఇంటర్ బోర్డు కమిషనర్ సయ్యద్ ఒమర్ జలీల్ రిలీజ్ చేశారు. ఎంసెట్ కౌన్సెలింగ్ ఉన్నందున కేవలం ద్వితీయ ఫలితాలు మాత్రమే విడుదల చేస్తున్నామని తెలిపారు. ఆగస్టు ఒకటో తేదీ నుంచి ఈ పరీక్షలను నిర్వహించగా దాదాపు 1.13 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.
ఈ ఫలితాలను పరీక్షకు హాజరైన అభ్యర్థులు https://tsbie.cgg.gov.in/ లేదా http://www.manabadi.co.in/ వెబ్‌సైట్ నుంచి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఇటీవల ఇంటర్ ఫలితాలను విద్యా మంత్రి సబితా ఇంద్రారెడ్డి రిలీజ్ చేశారు. ఇందులో తొలి యేడాది 63.32 శాతం, ద్వితీయ సంవత్సరం 67.16 శాతం చొప్పున విద్యార్థులు ఉత్తీర్ణుల్యారు. ఈ రెగ్యులర్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు అడ్వాన్స్‌డ్ సిప్లమెంటరీ పరీక్షలను ఆగస్టు ఒకటో తేదీ నుంచి నిర్వహించారు.